Home
Off The Record
Off The Record News
-
Off The Record: కవిత ఫోన్ కూడా ట్యాపింగ్? అందుకే కామ్‌గా ఉన్నారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి మోగిపోతోంది. సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్న క్రమంలో కవిత ఫోన్ ట్యాప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అదే పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ చేశారా? అన్న చర్చ మొదలైంది. -
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో... ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి సమాచారం చేరింది. -
Off The Record: నల్గొండ బీఆర్ఎస్ నేతలు అనాధలమైపోమంటూ ఎందుకు ఫీల్ అవుతున్నారు?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. బీఆర్ఎస్ క్యాడర్ పరిస్థితి వెన్న తిన్నవాడు వెళ్లిపోతే.. చల్ల తాగిన వాడిని చావ మోదినట్లు తయారైందట. ఒక వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్ధల ఎన్నికల కోసం.. వరుసగా గ్రామ, మండల, నియోజకవర్గ స్దాయి సమీక్షా సమావేశాలు పెట్టుకుంటుంటే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో మాత్రం ఆ సౌండే లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అంత మొనగాళ్ళు లేరని మీసాలు తిప్పిన మాజీలంతా.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారట. -
Off the Record: జనసేనాని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా?
జగన్.. గుర్తు పెట్టుకో.. నిన్ను అధహ్ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు.., నా పార్టీ జనసేనే కాదు.., ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇవి. అయితే, అది పవన్ వల్ల జరిగిందా? లేక ఇతరత్రా అన్ని కారణాలు కలిసి కొట్టాయా అన్నది వేరే సంగతి గానీ... మొత్తం మీద ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. -
Off The Record: వైఎస్ జగన్ పర్యటనలపై వైసీపీ నేతలు కంగారు పడుతున్నారా? ఎందుకా కంగారు..?
ఓటమి నుంచి కోలుకుని ఫుల్లీ రీఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్.... వరుస పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారట ఆయన. -
Off The Record: ఏపీ బీజేపీ నేతలు మేధావులమంటూ ఢిల్లీ నేతల కళ్ళకు గంతలు కడుతున్నారా?
ఏపీ బీజేపీలో నాయకుల తెలివితేటలు పెరిగిపోయి.. పొంగి పొర్లి.. డ్యాంలు కట్టినా ఆగకుండా బద్దలు కొట్టుకుని మరీ బయటికి ప్రవహించేస్తున్నాయా? అంటే.. వాస్తవం ఏంటో తెలియదుగానీ.. వాళ్ళు ఇస్తున్న బిల్డప్‌లు చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. వీళ్ళ ముందు.. బిల్డప్ బాబాయ్‌లు కూడా ఎందుకూ పనికిరారని చెప్పుకుంటున్నారు. పార్టీలో స్వయంప్రకటిత మేథావులు పెరిగిపోయి మొత్తానికే ముంచేలా ఉన్నారన్న భయాలు కూడా ఉన్నాయట కేడర్‌లో. -
Off The Record: వైసీపీ నేత గోరంట్ల మాధవ్ సైలెంట్ అయ్యారా? చేసారా? మొత్తం ఆ వీడియోనే చేసిందా?
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒక్కోసారి... అవే పాపులర్ చేస్తాయి. ఇంకోసారి ఎత్తి అగాధంలోకి పడేస్తాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఈ రెండూ జరిగిపోయాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన మాధవ్.... 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే... ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి. -
Off The Record: ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఒక్కసారిగా కూల్ అవడానికి కారణాలేంటి?
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి. -
Off The Record: సీఎం రేవంత్ ని నాడు వద్దన్న నేతలే.. నేడు పోటీ పడి పిలుస్తున్నారా?
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందనుకున్న నేతలకు... ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసుకుంటున్నారు హాస్తం పార్టీలోని కొందరు నేతలు. -
Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?
పోలీసింగ్‌లో వరంగల్‌కు ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అలాంటి పోలీసులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారట. బదిలీలు, సస్పెన్షన్లు, మెమోలతో హడలిపోతున్నారు. అది కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Kamal Haasan: కమల్ మాస్ లైనప్.. ఒకేసారి అరడజను సినిమాలు!
-
Imran Khan: ‘నా భార్యను కాపాడండి.. నా కేసు తర్వాత చూద్దాం’ లాయర్లకు ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్!
-
Narakasura Story : దీపావళి వెనుక పురాణ గాథ.. తెల్లవారుజామునే నూనె స్నానం ఇందుకే..!
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..