మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుండగా... అనుచరగణం మాత్రం చెలరేగుతోందని, కొంతమంది వ్యవహార శైలి వల్ల జనంలో నెగెటివ్ రిమార్క్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్... తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓనేతను దూరం పెట్టినట్టు సమాచారం
గెలిచాక ఎమ్మెల్యే ఇంటూరి ఓ గ్రూపును దూరం పెడుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుందట నియోజకవర్గంలో. సొంత పార్టీ క్యాడర్‌ను పక్కన పెట్టి తన మనుషుల్ని మండలానికో ఇంచార్జ్‌గా నియమించుకున్నారట. అక్కడ ఎంతటి నాయకులైనా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనట. ఇంటూరి పెట్టిన మనుషులకు తెలియకుండా... చీమ చిటుక్కుమనడానికి వీల్లేదన్నది లోకల్ టాక్. అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరారవును టార్గెట్ చేస్తూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సొంత పార్టీ కార్యకర్తలే పోస్టింగులు పెట్టడం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది.
ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుతున్న...ఆ మాజీ మంత్రి ఈ సారి ముందుగానే ఫిక్సయ్యారా ? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి నియోజకవర్గంలో పాలిటిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారా ? ఓడిన నియోజకవర్గంలోనే...గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారా ? సంక్రాంతి పండుగ తర్వాత...పార్టీ కార్యాలయం తెరిచేందుకు రెడీ అయిపోయారా ? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి...ఏంటా నియోజకవర్గం. ?
ఎమ్మెల్సీ సీట్ల కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైందా ? మండలిలో ఖాళీ అవ్వబోతున్న సీట్లకు డిమాండ్ పెరిగిందా ? కొందరు కేబినెట్ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్నారా ? మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు...ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా ? పార్టీ కోసం కష్టపడిన, సీట్లు త్యాగం చేసిన వారికి...పార్టీ గుర్తింపు ఇస్తుందా ? రేసులో ఉన్న నేతలు ఎవరు ?
మావోయిస్టు పార్టీ లేఖలు...ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఎందుకు వస్తున్నాయి ? వరుస లేఖలు నిజంగానే మావోయిస్టులు విడుదల చేస్తున్నారా ? లేదంటే వాటి వెనుక ఎవరైనా ఉన్నారా ? నేతలను, పోలీసులను...కలవరానికి గురిచేస్తున్న ఆ లేఖల సారాంశం ఏంటి ? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి...? వరుస లేఖలతో రాజకీయ నేతల్లో వణుకు మొదలైందా ?
తెలంగాణలో కులగణన సర్వేతో అంతా తెలిపోతుందా ? కులగణన తేలిపోయాక...స్థానిక సంస్థల ఎన్నికల వరకే అమలు చేస్తారా ? రాజకీయంగా ఆయా వర్గాలకు అవకాశాలు అంది వస్తాయా ? జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీట్లు కేటాయిస్తారా ? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
డైలీ సీరియల్లో సస్పెన్స్ సీన్ లను తలపించేలా అక్కడి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు వైసిపి కోర్టులో ఉన్న బాల్.. టిడిపి వైపు వెళ్ళింది. ఆ తర్వాత అదే బాల్ మళ్ళీ వైసిపి కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు ఎత్తులకు పైఎత్తు వేస్తూ…టిడిపి వేసిన వ్యూహంలో వైసిపి చిక్కుకుందా…? పొలిటికల్ టూర్లను తలపించే విధంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయా ? ఎన్నికలు లేని సమయంలో క్యాంప్ రాజకీయాలు ఏంటి ? ఎన్నికలు లేవు. ఓటింగ్ అసలే లేదు. అయినా…
ఆ పార్టీ నేతలు…పైకి మాత్రం మేమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటారు. లోపల మాత్రం ఎవరికీ వారే…యమునా తీరే. ఒకరి రిస్క్‌లోకి ఇంకొకరు రారు…వైరి పక్షం నుంచి విమర్శలు వచ్చినా…అసలు పట్టించుకోరు. అరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నించరు. విమర్శలు ఎదుర్కొన్న నేతలే…చివరికి కౌంటర్ ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది ? రాజకీయాల్లో పార్టీలు, నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కామన్. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం…పాలిటిక్స్‌లో నిత్యం జరిగేదే. పార్టీలపై ప్రత్యర్థులు ఏవైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే…వాటిని ఇంకో పార్టీ తిప్పి…
తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీల ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు..ఎవరి వ్యూహాలో వారి మునిగిపోయారు. మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ? గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటుందా ? కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది. 2019 మార్చిలో జరిగిన…
ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై బిజెపి కసరత్తు ప్రారంభించిందా ? టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతిని ప్రతిపాదించడం ఖాయమేనా ? ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతిని రంగంలోకి దించడం వెనుక ఆర్థికబలం, అంగబలం కారణమా ? కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతకు టికెట్ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారా ? తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలం పార్టీ దృష్టి సారించింది. త్వరలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై…