ఒక నియోజకవర్గంలో జరిగే గొడవల గురించి ఇంకో నియోజకవర్గానికి చెందిన నాయకులు పట్టించుకునే పరిస్థితి సాధారణంగాఉండదు. అలా జోక్యం చేసుకోవడానికి అవతలివాళ్ళు ఒప్పుకోరు, ఏ పార్టీ అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహించదు. కానీ... మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ.... శింగనమలలో జోక్యం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
జిల్లా మొత్తం మీద ఆయనొక్కడే పోటుగాడా? ఆ మాత్రం దమ్మున్న లీడర్స్ ఇంకెవరూ లేరా? ఒక్కడికే నాలుగు పదవులు ఎలా ఇస్తారు? ఇదీ... ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన నేతల ఫ్రస్ట్రేషన్. ఇంతకీ ఎవరా నాలుగు పదవుల నాయకుడు?
పేరెంట్ డిపార్ట్మెంట్ వద్దు... పక్క శాఖ ముద్దు అంటున్నారా మహిళా అధికారి. తన సొంత శాఖకు ప్రమోషన్ ఇచ్చి పొమ్మన్నా పట్టించుకోకుండా ఆలయ ఈవోగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి ఓ ప్రముఖ ఆలయ అధికారిగా ఉండేందుకు చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ఆ అధికారి ఎవరు?
ఆ మాజీ మంత్రికి తత్వం బోథపడిందా? అందలం ఎక్కించిన పార్టీనే అధికారంలో లేనప్పుడు లైట్ తీసుకున్నదానికి ఫలితం అనుభవిస్తున్నారా? అందుకే…. పొలిటికల్ చాణక్యం తెలిసిన సదరు లీడర్ ఇప్పుడు ప్లాన్ బీ అమలు చేస్తున్నారా? అందుకే ఇప్పుడు పార్టీ పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతూ రండి… రండి… రండి… దయచేయండని స్వాగతాలు పలుకుతున్నారా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఏంటా కథ? గంటా శ్రీనివాసరావు….భీమిలి ఎమ్మెల్యే. మాజీమంత్రి. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత.…
తెలంగాణ ప్రభుత్వంలో ఏదీ దాగే పరిస్థితి లేదా? దాచాలంటే దాగదులే... దాగుడు మూతలు చెల్లవులే అన్నట్టుగా ఉందా వ్యవహారం? అత్యంత కీలకమైనది, టాప్ సీక్రెట్ అనుకున్న రిపోర్ట్ కూడా ప్రతిపక్షం చేతికి అందిందా? లీకు వీరులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా?
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దారెటు..? ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పోలీస్ ఆంక్షల కారణంగా... సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లలేరు. 14 నెలల నుంచి ఆయన టౌన్లోకి రాకుండా ఇటు జేసీ ప్రభాకర్రెడ్డి, అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానంటూ తన సైన్యాన్ని సిద్ధం చేస్తారు జేసీ. నువ్వు అటు వైపు చూసినా... లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటారు పోలీసులు. దీంతో... సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా…