ఆ ఐదుగురు ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపు ఆరోపణలున్న వారి మీద స్పీకర్ చర్యలు ఉంటాయా? లేక కొత్త కొత్త ట్విస్ట్‌లకు అవకాశాలున్నాయా? ప్రత్యేకించి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తెలంగాణ సభాపతి నిర్ణయం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. అనర్హత పిటిషన్స్‌పై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఐదుగురికి క్లీన్ చిట్…