Off The Recrod : ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కొత్త ట్విస్టులు?
- ఐదుగురికి క్లీన్‌చిట్, మిగతా ఐదుగురి సంగతేంటన్న చర్చ
- పోచారం, కాలే యాదయ్య, సంజయ్ విచారణ పూర్తి, నిర్ణయం పెండింగ్
- కడియం, దానం విషయంలో పెరుగుతున్న ఉత్కంఠ
- బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదని కడియం వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఐదుగురు ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపు ఆరోపణలున్న వారి మీద స్పీకర్ చర్యలు ఉంటాయా? లేక కొత్త కొత్త ట్విస్ట్‌లకు అవకాశాలున్నాయా? ప్రత్యేకించి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తెలంగాణ సభాపతి నిర్ణయం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. అనర్హత పిటిషన్స్‌పై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్, తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టు సరైన సాక్ష్యాలు లేవంటూ వాళ్ళకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్స్‌ను డిస్పోజ్ చేశారు. దాంతో… మిగతా ఐదుగురి సంగతేంటన్న చర్చ మొదలైంది. అందులో కూడా….పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్స్ మీద విచారణ ముగిసింది. ఇక జడ్జిమెంట్ మిగిలిఉంది. అలాగే… ఇంకో ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ సంగతేంటి? ఆ పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. స్పీకరించిన నోటీసులకు ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. వాటి ఆధారంగానే ఐదుగురికి లైన్ క్లియర్ అయిపోయింది.
మిగతా ఐదుగురిలో బాగా క్రిటికల్ అనుకుంటున్న ఇద్దరి విషయంలో స్పీకర్ ఏం చేస్తారోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. ఆ ఇద్దరిలో ఒకరు కడియం శ్రీహరి కాగా…ఆయన కూడా ఇప్పటికే వివరణ ఇచ్చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదని, ఇప్పటికీ తన జీతం నుంచి నెలనెలా కొంత మొత్తం బీఆర్‌ఎస్ ఎల్పీ ఖాతాలో జమ అవుతోందన్న వివరాలను కూడా సమర్పించారు శ్రీహరి. అయితే… పొలిటికల్‌గా బీఆర్‌ఎస్ దాన్ని కౌంటర్ చేస్తూ సోషల్ మీడియా యుద్ధం చేస్తోంది అది వేరే సంగతి. ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే….స్పీకర్ నోటీస్‌కు ఇప్పటిదాకా వివరణే ఇవ్వలేదు. అసలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా అనేది కూడా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే…టెక్నికల్‌గా అందరికంటే ఎక్కువగా ఇరుక్కుపోయింది ఆయనే అన్నది విస్తృతాభిప్రాయం. బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన దానం రాజీనామా చేయకుండానే… లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడే అసలు సిసలు సంకటం మొదలైంది. నాగేందర్ విషయంలో ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సివస్తే…ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరుగుతోంది. పార్టీ మారలేదని, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ మిగతా ఎమ్మెల్యేలు చెప్పిన వివరణను పరిగణలోకి తీసుకున్న స్పీకర్… దానం నాగేందర్ విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఉత్కరంఠగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.
Also Read
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరపున బరిలో దిగ కూడదు. ఇక్కడే దానం ఇరకాటంలో పడ్డారన్నది అందరి అభిప్రాయం. మరి దాంట్లో కూడా ఇంకేవైనా చట్టపరమైన వెసులుబాట్లు ఉన్నాయా? లేక ఆయన విషయంలో యాక్షన్ తప్పదా అన్న చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే… వోవరాల్‌గా ఈ ఫిరాయింపులకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. జనవరిలో విచారణ ఉన్న క్రమంలో అప్పటి వరకు వేచి చూస్తారా..? లేదంటే అంతకంటే ముందే స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి తోడు… అసెంబ్లీ కార్యదర్శి నరసింహచార్యులును కౌన్సిల్‌కు బదిలీ చేశారు. దాంతో.. కొత్త కార్యదర్శి వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు..? ప్రస్తుతానికి ఉన్న అనర్హత పిటిషన్స్ అన్నిటిని.. నరసింహచార్యులే పూర్తి చేస్తారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నందున అటు పిటిషన్లు…ఇటు సభ నిర్వహణ లాంటి అంశాలపై చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే… అనర్హత పిటిషన్స్‌ని క్లియర్ చేయడానికి ముందు రోజే పిటిషనర్స్‌కు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికైతే అలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. దాంతో మిగతా ఐదురుగురి విషయంలో స్పీకర్ జడ్జిమెంట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్‌లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..