Israel: 2023 అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్‌లోకి చొరబడి దారుణమై దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా దారుణంగా చంపేశారు. పడుకొని ఉన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. అత్యంత కిరాతకంగా ఇజ్రాయిలీలను హతమార్చారు. ఈ దాడి�
Hezbollah Attacks: హిజ్బుల్లా గ్రూప్ మరోసారి ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇజ్రాయెలీ ఓడరేవు నగరమైన హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లతో దాడికి దిగింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి వార్షికోత్సవం సందర్భంగా ఈ దాడులకు దిగింది.
Iran- Israel Conflict: ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమాన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం (అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసింది.
Israel: అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ఏడాది అవుతున్న తరుణంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. అయితే, ఆదివారం రోజు దక్షిణ ఇజ్రాయిల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పల్లో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు. దక్షిణ ఇజ్రాయిల్‌లోని బీర్ షెవాలో ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి.
Israel-Gaza War: అక్టోబర్ 07 నాటి దాడులకు రేపటితో ఏడాది పూర్తి అవుతున్న వేళ హమాస్ మరోసారి తన దురుద్దేశాన్ని ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయిల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంపై రాకెట్లు ప్రవేశించాయి.