గత నాలుగు వారాలుగా హౌస్ మేట్స్ ముందే నామినేషన్స్ ప్రక్రియను నిర్వహించిన బిగ్ బాస్ ఈసారి మాత్రం పవర్ రూమ్ కు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరినీ పిలిచి, తాము నామినేట్ చేయాలని అనుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పమని కోరాడు. దాంతో అందరూ తమ మనసులోని వారిని నిర్మొహమాటంగా నామినేట్ చేసేశారు. తీరా నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరెవరి పేర్లను, ఎవరెవరు నామినేట్ చేశారో ఫోటోలతో సహా, హౌస్ లోని టీవీలో డిస్ ప్లే చేశాడు…