సుంకాలపై ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1, 2025 నుంచి 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ చర్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ వరకు కోర్టు అనుమతి లేకుండా దేశంలో ఎక్కడా ఆస్తులను కూల్చరాదని ధర్మాసనం ఆదేశించింది.