సుంకాలపై ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1, 2025 నుంచి 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఫార్మా దిగుమతులపై ఎక్కువగా అమెరికాతో భారతదేశమే వాణిజ్యం చేస్తోంది. దీంతో ఎక్కువగా భారత్‌పైనే ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం అమలవుతోంది. కొత్తగా అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపైన కూడా 100 శాతం సుంకం విధించడంతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bharat Margani: బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉంది.. మాజీ ఎంపీ ఫైర్..
అమెరికాతో భారతదేశం అతిపెద్ద ఫార్మాస్యూటికల్ వస్తువుల ఎగుమతి మార్కెట్ ఉంది. 2024లో భారతదేశం నుంచి రూ.7,72,31 కోట్లు ఫార్మా ఎగుమతులు జరిగాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పరిశ్రమ సంస్థ తెలిపింది. ఇక 2025 మొదటి అర్ధభాగంలో రూ.32,505 కోట్ల విలువైన ఫార్మా ఉత్తత్తులు ఎగుమతి చేసినట్లు పేర్కొంది. ఆయా నివేదికల ప్రకారం.. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం భారతదేశం సరఫరా చేస్తుంది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, సన్ ఫార్మా , గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు ఆదాయంలో 30-50 శాతం వరకు అమెరికన్ మార్కెట్ నుంచే సంపాదిస్తున్నట్లు సమాచారం. అమెరికన్లు.. భారతదేశంలో తయారయ్యే తక్కువ ధర జనరిక్‌లపైనే ఆధారపడతారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఫార్మాపై 100 శాతం సుంకం విధించడంతో అమెరికన్లు ఇబ్బంది పడవచ్చు.
ఇది కూడా చదవండి: Raashi Khanna : పదునైన అందాలతో సెగలు రేపిన రాశిఖన్నా
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఇప్పుడు ఫార్మాపై ఏకంగా 100 శాతం సుంకం విధించారు. ఇది భారత్‌ను భారీ దెబ్బ కొట్టినట్లవుతుంది.