బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, మొన్నటి అందాలభామ కాజోల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి వారిద్దరూ కలసి నటించడం లేదు, పైగా కాజోల్ కు మునుపటిలా సినిమాలూ లేవు. మరెందుకలాగా… అంటారా? వారి ముద్దుల కూతురు నైసా ఎక్కడ కనిపించినా, పేపరాజ్జీ వెంటాడుతోంది. నైసా ఎక్కడైనా కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్ తమ షెట్టర్స్ కు పనిచెబుతున్నారు. క్లిక్… క్లిక్… క్లిక్… అంటూ మోత మోగిస్తున్నారు. దీంతో నైసా తన ప్రైవసీ కోసం పరుగులు తీయాల్సి వస్తోంది.…