Himanta Biswa Sarma: పాకిస్తాన్‌ని అణ్వాయుధ దేశం మారేందుకు కాంగ్రెస్ చేసిన ‘‘చారిత్రక తప్పిందాలు’’ కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. పాకిస్తాన్ తాను చేస్తున్న ఉగ్రవాదానికి, పరోక్ష యుద్ధానికి ‘‘అణు బ్లాక్‌మెయిల్’’ని వాడుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం, చాలా దేశాలు అణు బెదిరింపులను తటస్థీకరించేందుకు నిర్ణయాత్మంగా వ్యవహరిస్తున్న సమయంలో, 1980లలో భారత నాయకత్వం పాకిస్తాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు షేర్ చేశారు.