నేడు ఖమ్మంలో వైఎస్ఆర్టీపీ నేత వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్టీపీ నియోజకవర్గాల బూత్ కమిటీల నియామకం కార్యక్రమంలో పాల్గొంటారు. రిటైర్డ్ రిటర్నింగ్ అధికారులతో ట్రైనింగ్ కార్యకర్తలతో సమావేశంకానున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టనున్న కార్యక్రమాలపై నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో…
బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారన్నారు. కాంగ్రెస్ తమ పథకాలు కాపీ కొట్టి కొత్తగా చెబుతున్నదని విమర్శించారు. తనది అద్భుతమైన మేనిఫెస్టో అని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని, వచ్చేసారి 16 వేలు…
ఆలోచించు తెలంగాణ రైతన్నా: కేటీఆర్ దసరా పండగ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అని పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇందుకోసం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ నేడు ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్…
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ 49వ రోజుకు చేరింది. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు ములాఖత్ కానున్నారు. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన బాబు అరెస్టయిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు ఉంది. నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి 3వ రోజు పర్యటన కొనసాగనుంది. టీడీపీ…
పాక్ ఆర్థిక సంక్షోభం: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది. పీఐఏ, పీఎష్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించనిదే, ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది. మరోవైపు పీఐఏని ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం…
తిరుమలలో నేటితో ముగియనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ఉదయం వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నప్న తిరుమంజనాని అర్చకులు నిర్వహించనున్నారు. ఇక, చక్రతాళ్వార్కీ అర్చకులు పుష్కరిణిలో శ్రీవారికి అవబృద్ద స్నానం చేయించనున్నారు. దీంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇవాళ రాత్రి బంగారు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల మాడ…
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు నారా లోకేష్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు టీడీపీ…
52 మందితో బీజేపీ తొలి జాబితా: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీసీలతో పాటు సీనియర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. హుజారాబాద్తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్…
దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న పెద్దమ్మ తల్లి: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఈరోజు శ్రీ దుర్గాదేవిగా ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు. దశమి రోజే ఆయుధ పూజ కూడా ఉంటుంది. దశమి రోజు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు అందిస్తారు.…
స్కిల్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ 44వ రోజుకు చేరింది. గత నెల 9న అరెస్టైన చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు కొనసాగనుంది. సెలవు దినాలు కావడంతో మూడు రోజులు ములాఖత్లు నిలిపివేయబడ్డాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. నేటి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా…