ముందు మూడన్నారు…. తర్వాత రెండయ్యాయి. ఇప్పుడు ఒకటేనంటే ఎలా? మరీ ఇంత త్యాగరాజులైతే ఎలా? సర్దుకుపోవడానికి కూడా ఓ హద్దు ఉండాలి కదా… ఇదీ ఇప్పుడు జనసేన అధిష్టానాన్ని ఉద్దేశించి ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న మాట. అత్యంత కీలకమైన జిల్లాలో ఒక్క సీటుకు పరిమితం అయితే పరువేం కావాలంటూ ప్రశ్నిస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా? పార్టీ అధిష్టానం ఎందుకు కాంప్రమైజ్ అవుతోంది? ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేన పోటీ చేసే స్థానాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త చర్చ…
పోటీలో నేను లేనప్పుడు ఎవరు గెలిస్తే నాకేంటి? అది పొత్తు ధర్మమా? మరోటా అన్నది జాన్తానై? మన మిత్ర పక్షం గెలిస్తే ఓకే… ఓడి ప్రత్యర్థి గెలిచినా… నా కులపోడే…కాబట్టి నాకు ఊడేదేం లేదు. ఇలా ఉందట అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వైఖరి. జనసేన గెలిచినా, వైసీపీ గెలిచినా నాకొచ్చేదేంటన్న రీతిలో ఉన్న ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? వైశాల్యం, ఓటర్ల పరంగా చిన్నదైనా…రాజకీయ చైతన్యం పరంగా అతిపెద్ద ప్రభావం చూపగల సెగ్మెంట్…
బీఆర్ఎస్లో అభ్యర్థుల్ని ప్రకటించకుండా మిగిలిపోయిన సీట్ల సంగతి ఏంటి? కవిత అరెస్ట్ తర్వాత పార్టీలో పరిస్థితి ఎలా మారిపోయింది? ఆ ఐదు సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యేది ఎన్నడు? అర్ధంతరంగా ఆగిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూల సంగతి ఇక అంతేనా? లోక్‌సభ ఎన్నికల విషయంమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తత్వం బోధపడ్డ బీఆర్ఎస్ అధిష్టానం… రివ్యూ మీటింగ్స్ పెట్టింది. నాడు ఓడిపోవడానికి కారణాలపై పోస్ట్‌మార్టంతో పాటు… లోక్‌సభ ఎన్నికల్లో తీసుకోవాల్సిన…
రెండు ఓట్లు ఉన్నవాళ్ళు ఈసారి ఎక్కడ ఓటేస్తారు? వారి ప్రయారిటీ ఎటువైపు ఉండవచ్చు? రాజకీయ వర్గాల్లో కొత్తగా మొదలైన చర్చ ఇది. అదేంటీ… ఎవరికైనా ఉండాల్సింది ఒక ఓటే కదా? అదే కదా రూల్? రెండు ఓట్లు ఇల్లీగల్ కదా… అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈసారి ఎన్నికల్లో ఈ డబుల్ బాబులకు వెరైటీ కష్టం వచ్చేసిందట. ఇంతకీ ఏంటా డబుల్ ఓట్స్ స్టోరీ? వాళ్ళకు వచ్చిన కొత్త కష్టం ఏంటి? ఏపీలో అసెంబ్లీ,…
వరుస దూకుళ్ళతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గేట్స్ ఓపెన్ అని చెప్పాక పరిస్థితులు ఎలా మారుతున్నాయి? రెడీ.. గెట్ ..సెట్.. అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? మర్యాదపూర్వకంగా అంటూ గతంలోనే సీఎంని కలిసిన వారిని ఎలా చూడాలి? జంపింగ్ జపాంగ్‌లపై పార్టీ అధిష్టానం వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడంతా జంపింగ్ జపాంగ్‌ల సీజన్ నడుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు జంప్…
రీల్ పోలీస్ యాక్షన్ కంటే ఒక ఆకు ఎక్కువగానే చేస్తున్నారట ఆ రియల్ పోలీస్ ఆఫీసర్. నేను మోనార్క్‌ని అంటూ… ఇల్లీగల్ దందాల మీద విరుచుకు పడుతున్నారట. ప్రజా ప్రతినిధులను సైతం జైలుకు పంపడంతో హీరో ఇమేజ్ సంపాదించుకున్న సదరు ఆఫీసర్ కూడా ఒక నాయకుడి విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారట. అది తెలిసి మంత్రులకు కిందా మీదా కాలిపోతోందట ఇంతకీ ఎవరా ఆఫీసర్? ఏమా కథ? కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో…
ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతలు ఎక్కువ మందిలో ఆందోళన పెరుగుతోందా? బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారంటీ అని ప్రచారం చేద్దామంటే… తమ భవిష్యత్కే గ్యారంటీ లేకుండా పోతోందని కంగారు పడుతున్నారా? ఇక్కడి నేతలు ఏం కోరుకుంటున్నారు? పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు? కొందరు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మరి కొందరు పక్క పార్టీల వైపు ఎందుకు చూస్తున్నారు? కడప టీడీపీలో కలకలం రేగుతోందట. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం సమస్యతో సతమతం అవుతున్నారు నేతలు. ఇన్నాళ్ళు నానా…
ఉంచేద్దామా? మూసేద్దామా? సూటిగా, సుత్తిలేకుండా చెప్పండి. ఆఫీస్‌లకు అద్దె కూడా కట్టకుండా మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? క్లారిటీ ప్లీజ్… ఇదీ బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల ఆవేదన. ఆ ఆవేదనతోనే కేసీఆర్ మీదికి లేఖాస్త్రాన్ని సంధించారా లీడర్స్. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్ బిల్డింగ్‌లకు అద్దె కట్టడం లేదు, మా ఫోన్లు ఎత్తడం లేదు. సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేం పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అసలు మా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఉంచుతున్నారా?…
సీటూ మాదే… ఓటు వేటా మాదేనంటూ ఇన్నాళ్ళుగా తొడలు కొట్టుకుంటూ తిరిగిన ఆ సీనియర్స్‌కి ఇప్పుడు సీట్లు చిరిగిపోతున్నాయా? కష్ట కాలంలో, క్లిష్ట సమయాల్లో సైతం గెల్చిన నేతలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు కానివారయ్యారు? ఉమ్మడి వెస్ట్‌లో సూపర్ సీనియర్స్ అనుకున్నవారిని సైతం ఫస్ట్ లిస్ట్‌లో పార్టీ అధిష్టానం ఎందుకు పక్కన పెట్టింది? ఎవరా నేతకు? ఎందుకలా జరిగింది? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్స్‌కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. తమ రాజకీయ జీవితంలో…
లోక్‌సభ ఎన్నికల్లో దున్నేస్తాం…. దుమ్ము దులిపేస్తాం…. తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టేస్తామని సవాళ్ళు చేస్తున్న కాషాయ దళానికి ఆ జిల్లాలో నడిపే నాయకుడు లేడట. ప్రతి సీటు ముఖ్యమని భావిస్తున్న టైంలో రెండు నియోజకవర్గాలున్న జిల్లాను పార్టీ నాయకత్వం ఎందుకు లైట్ తీసుకుంది? మాకో నాయకుడు కావాలి మొర్రో….. అని కేడర్ మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏదా జిల్లా? ఏవా రెండు నియోజకవర్గాలు? లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి టార్గెట్ 400 అంటోంది…