ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఎస్ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. సమావేశం తర్వాత మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కొత్త ఏడాదిలో మంత్రులకు కొత్త టార్గెట్లను విదించనున్నారు. నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవం ఆరంభం కానుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి 11రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరగుతుంది. ఇవాళ…
ముందుగా ప్రజల దర్శనం: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు చేసి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు రాగా.. ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న…
సరికొత్త ఆలోచనలతో బెజవాడ పోలీసులు: కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై ప్రయాణికులకు చైతన్యం కల్పిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. విజయవాడ పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు అర్ధరాత్రి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూనే.. ప్రజలకు స్వయంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు పోలీసు శాఖ తరఫున సీపీ హెల్మెట్లు పంపిణీ చేశారు. కొత్త ఏడాదిలో కొంగొత్త ఆలోచనలతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో…
ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సీఎం చంద్రబాబు దుర్గగుడికి వెళ్లనున్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం టీడీపీ కేంద్రకార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నేటి నుండి దక్షిణ మధ్య రైల్వే నూతన పబ్లిక్ టైమ్ టేబుల్ అమలు కానుంది. రైలు సమయాల్లో మార్పును ప్రయాణికులు గమనించగలరని అధికారులు కోరారు. నేడు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో జరిగే సమావేశంలో…
బీసీలకు మరోసారి పెద్దపీట: సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో చాలామంది బీసీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారని, ఇదంతా సీఎం చంద్రబాబు ఘనతే అని మంత్రి అనగాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి…
ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్‌కు సీఎస్‌గా…
శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. సోమవారం రాత్రి 9:58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చ జరగనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో నేడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య…
జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై జగన్ ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే అని, సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితమే…
సామాన్యులకు అధిక ప్రాధాన్యం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు. జనవరి 10, 11, 12వ తేదీలకు గాను…
ఈరోజు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్ కూతురి వివాహానికి హాజరుకానున్నారు. నేడు పులివెందులలోని వైసీపీ క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రేపు బెంగళూరులో ఓ వివాహానికి హాజరుకానున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఏపీ విపత్తుల శాఖ పర్యటించనుంది. ముండ్లమూరు, తాళ్లూరు మండళ్లాల్లో వరుస భూప్రకంపనలపై అధ్యయనం చేయనున్నారు. నేడు వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. పలు ప్రాంతాల్లో వంగవీటి రాధాకృష్ణ…