Off The Record : రేవంత్, కిషన్ వ్యవహారం పాము, ముంగిస కొట్లాటలా ఉందా?
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈనెల 3న మొదటి లేఖ
- 6న అంబర్‌పేట ఫ్లయ్‌వోవర్ సమస్యపై లెటర్
- 9న ఎన్టీపీసీ కరెంట్ కొనుగోలుకు సంబంధించిన లేఖ
- కేంద్ర మంత్రి వరుసబెట్టి ఎందుకిలా లెటర్స్ రాస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పది రోజుల వ్యవధిలో మూడు లేఖలు. ప్రతి దాంట్లో ప్రజా సమస్యల ప్రస్తావన. ఒక కేంద్ర మంత్రి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రిని ఉద్దేశించి అలా వరుస లేఖాస్త్రాలు ఎందుకు సంధిస్తున్నారు? అట్నుంచి రియాక్షన్ ఉందా? లేదా? అన్నదాంతో సంబంధం లేకుండా…. ప్రేమ లేఖ రాశా… నీకంది ఉంటదీ…. అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అందులో రాజకీయ ఎత్తుగడలున్నాయా? ఎవరా సీఎం, కేంద్ర మంత్రి? ఏంటా లేఖాయణం? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరుబెట్టి లేఖలు రాస్తున్నారు. ఒక్క మార్చిలోనే ఇప్పటి వరకు మూడు లెటర్స్ రాశారాయన. రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఈ నెల 3న సీఎంకు ఫస్ట్ లెటర్ రాశారు కేంద్ర మంత్రి. ఆ తర్వాత అంబర్ పేట ఫ్లై ఓవర్ పక్కన ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ ఈ నెల 6న సెకండ్ లెటర్ రాసేశారు. ఇక ఇక్కడ తయారయ్యే ఎన్టీపీసీ కరెంట్‌ను రాష్ర్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, బొగ్గు సమకూర్చుకోవడంలో ఆ సంస్థ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ ఈ నెల 9న రేవంత్‌కు మూడో లేఖ రాశారు కిషన్.
ఈ క్రమంలోనే సెంట్రల్ మినిస్టర్ ఎందుకిలా చేస్తున్నారు? దీని వెనకున్న మతలబేంటి? అన్న చర్చలు మొదలయ్యాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. పైకి ప్రజా ప్రయోజనాల్లా కనిపిస్తున్నా… ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత తక్కువ వ్యవధిలో అన్ని లెటర్స్ రాయడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కిషన్ రెడ్డి గతంలో కూడా సీఎంలకు లేఖలు రాశారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ…. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ… ఈసారి మాత్రం ఫ్రీక్వెన్సీ పెరగడంపైనా అనుమానాలు ఉన్నాయట చాలామందికి. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో కిషన్‌రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య వ్యవహారం పాము ముంగిస కొట్లాటలా ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. సీఎం మాట్లాడుతున్న తీరు సెంట్రల్ మినిస్టర్‌కి అస్సలు రుచించడం లేదట.
Also Read
రేవంత్ రెడ్డి సొంతగా పని చేయలేక.. కేంద్రవైపు వేళ్ళు చూపిస్తూ… తనను బద్నాం చేస్తున్నారన్నది కిషన్‌రెడ్డి అభిప్రాయంగా తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించిన క్రమంలో… తను రాసిన లేఖలను బయట పెట్టారు కేంద్ర మంత్రి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా తనపై వచ్చిన ఆరోపణలకు కౌంటర్‌గా తను రాసిన లేఖలను విడుదల చేశారు కిషన్. అప్పట్లో ఒక్క లేఖకు కూడా రిప్లయ్ లేదని, తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదని చెప్పారు కిషన్‌రెడ్డి. ఇప్పుడు కూడా…. ఊరికే కేంద్రాన్ని విమర్శించడం కాదు, వీటి సంగతి ఏందంటూ రేవంత్‌కు కౌంటర్స్ ఇవ్వడమే కేంగ్ర మంత్రి అసలు ఉద్దేశ్యం అయి ఉంటుందని అంటున్నారు. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో చేస్తున్నా… రాష్ర్ట సర్కార్ నుంచి సహకారం అనుకున్న స్థాయిలో లేదని చెప్పడమే కిషన్ ఉద్దేశ్యమన్న వాదన బలంగా ఉంది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!