ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలలో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో యూట్యూబర్ పోస్ట్ చేశాడు.
ఎమ్మిగనూరులో వైద్యుని నిర్లక్ష్యంతో శిశువు మృతి పై అధికారులు స్పందించారు. శిశువు మృతిపై NTV లో వరుస కథనాలు ప్రసారం కావడంతో.. జిల్లా వైద్యాధికారిణి సత్యవతి విచారణ చేపట్టారు. బాలుడికి చికిత్స కోసం తీసుకొచ్చిన సూర్యతేజ హాస్పిటల్ లో రిటైర్డ్ సూపరెంటెండెంట్ డా. బాలయ్యను వైద్య అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా.. శిశువుకు చికిత్స చేసిన డాక్టర్ రాఘవేంద్ర వివరాలపై ఆరా తీస్తున్నారు.