మేషం : ఈ రోజు ఈ రాశివారికి అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో పునరాలోచన చాలా అవసరం. విదేశీ వస్తువుల పట్ల…