మేషం : ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా గుర్తింపు,…