మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలలో ఒత్తిడి అధికమవుతుంది. వృషభం : ఈ రోజు మీ కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి…