డిసెంబర్ 3, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలలో ఒత్తిడి అధికమవుతుంది.
వృషభం : ఈ రోజు మీ కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలు పునరావృతమవుతాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. శకునాలు, పొరుగువారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. వాహనం వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి వస్తుంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు టి.వి., కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. శ్రమాధిక్యత, మానసికాందోళన వల్ల అనారోగ్యానికి గురయ్యే ఆస్కారం ఉంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జప్తికి రాగలవు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు అంతగా ఫలించక పోవచ్చును. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం శ్రేయస్కరం. ఊహించని ఖర్చువల్ల చేబదుళ్ళు వంటివి తప్పవు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. పట్టింపుల వల్ల స్త్రీలు విలువైన అవకాశాలు కోల్పోయే ఆస్కారం ఉంది. శత్రువులు మిత్రులుగా మారిసహాయం అందిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవసాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
మకరం : ఈ రోజు ఈ రాశివారు విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని పొందుతారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి. సహోద్యోగులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పొదుపు పథకాలపై శ్రద్ద వహించండి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఆలయాలను సందర్శిస్తారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది. కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!