మేషం : ఈరోజు మీరు అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. జాగ్రత్త వహించడం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలకు అనుకూలం. మీ శ్రీమతి మొండి వైఖరి…