దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’`. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ ను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో కొమురం భీం, సీతారామరాజు సంబరాల్లో పాల్గొంటున్నట్టుగా అన్పిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2021 అక్టోబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులకు సినిమాను సినిమాను త్వరగా చూడాలన్న ఆతృతను పెంచేశాయి. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, శ్రియ శరన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు.