ఒక్క సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోలు, దర్శకనిర్మాతల కెరీర్ ట్రాక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మధ్య టాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. హిట్ కొట్టినప్పుడు కొత్త ప్రాజెక్టులు వరస కట్టుతుంటాయి. కానీ ఒక్క ఫ్లాప్ పడగానే ఆఫర్స్ వెనక్కి వెళ్లిపోతాయి, ఇప్పటికే ప్లాన్ చేసిన సినిమాలు హోల్డ్‌లో పడిపోతాయి. ఎన్టీఆర్ వరుస విజయాల తరువాత వార్2లో బిజీ అయ్యాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మారడంతో, తారక్ తన పూర్తి…