Nandamuri Bhargav Ram: నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా ఆయన ఎదగడానికి ఎంతో సమయం పట్టింది. నందమూరి లెగసీని కాపాడడంలో ఎన్టీఆర్ సైతం తనదైన కృషి చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తరువాత ఆ లెగసీని ముందుకు తీసుకొచ్చేది ఆయన కుమారులే.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకుని తన అభిమానులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఒక శుభకార్యం జరిగినట్లు సమాచారం. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. ఆయన 2018…