ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గ్రామపెద్దలు
కుక్కల మారణహోమానికి మరో బాలుడు బలైపోయాడు. కుక్కల స్వైరవిహారానికి ప్రాణాలు పోతున్నా.. అధికారుల మాత్రం పట్టించుకోవడంలో లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న లారీలను రైతులు…
ఎన్టీఆర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. స్థానిక మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. నందిగామలోని కంచల, పెండ్యాలలో సీనరేజ్ వసూలు చేయవద్దని చెప్పినా తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్..
Tiruvuru Police Station: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో పైకప్పునకు వేసిన సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెక్టార్-1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయణ బయట వరండాలో ఉండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేరని ఎస్సై తెలిపారు. Also Read: South Africa Cricket: రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ ఓటమే.. దక్షిణాఫ్రికాను వెంటాడుతున్న దురదృష్టం! దశాబ్దాల కిందట నిర్మించిన…
నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.
Vijayawada: వరద ముంపు నుంచి ఇంకా విజయవాడ నగరం తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను కూడా బుడమేరు వాగు ప్రవాహం వదలి పెట్టలేదు. నున్న , గన్నవరం, సింగ్ నగర్ వెళ్ళే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. శివారు ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాలు ఖాలీ స్థలాలు, అపార్ట్ మెంట్లు ఇంకా నీటిలోనే మునిగిపోయాయి.
NTR District: విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరదలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు కలెక్టరేట్లోనే బస చేస్తానని సీఎం నిర్ణయించుకున్నారు.