హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. కాగా.. ఈ సమావేశంలో టీటీడీపీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె 'పెట్టుకోండి సార్' అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Huge Celebrations at NTR Bhavan: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (88)ను ఇప్పటికే దాటేసింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కనబర్చారు. కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతుండడంతో.. కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ…
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే…