నందమూరి నట సింహ బాలకృష్ణ, అనీల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రానున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 8న వరంగల్ లో భగవంత్ కేసరి గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయనున్నారు. ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో వేగం…