Bigg Boss 18: ప్రధాని నరేంద్రమోడీ మాజీ బాడీగార్డ్ లక్కీ బిష్త్ బిగ్ తాను బిగ్ బాస్ 18 ఆఫర్ తిరస్కరించినట్లు చెప్పారు. మాజీ ‘‘రా’’ ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో లక్కీ బిష్త్ పొల్గొనాలని ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. ఒకప్పుడు బిష్త్ ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేశారు.
VIP security: హైరిస్క్ జాబితాలో ఉన్న 9 మంది వీఐపీలకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కమాండోలను విత్ డ్రా చేసుకుని వారి స్థానంలో సీఆర్‌పీఎఫ్ కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన తాజా బెటాలియన్‌ను కూడా మంజూరు చేసింది. ఇటీవల పార్లమెంట్ సెక్యూరిటీ విధుల నుంచి ఉపసంహరించుకోబడిన సీఆర్‌పీఎఫ్-వీఐపీ సెక్యూరిటీ వింగ్‌ని ప్రముఖుల భద్రత కోసం…
ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (స్పెషల్ డీజీ)గా నియమితులయ్యారు. సెప్టెంబరు 30న ఆర్‌ఆర్ స్వైన్ పదవీ విరమణ తర్వాత ఆయన దళం చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Moscow-Goa Flight With 244 Onboard Lands In Gujarat After Bomb Threat: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని గుజరాత్ జామ్‌నగర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జామ్ నగర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో…
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను సందర్శించింది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) టీమ్… ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఎన్‌ఎస్‌జీ ఐజీ సిమిర్దీప్ సింగ్ నేతృత్వంలోని టీమ్.. టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించింది.. ఆఫీసులోని ప్రతీ గదిని పరిశీలించారు.. అంతే కాదు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని కూడా పరిశీలించారు.. నివాసంలోని ప్రతీ గదిని వారు పరిశీలించినట్టుగా చెబుతున్నారు. చంద్రబాబు భద్రతపై తాము ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపాయి టీడీపీ…
జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు జరిగాయి.. వెంటనే హైఅలర్ట్ ప్రకటించాయి భద్రతా దళాలు.. ఘటనా స్థలాన్ని ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జి టీమ్‌లో పరిశీలించాయి.. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్‌లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఇవాళ తెల్లవారుజామున రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. అయితే, అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.. ఎటువంటి నష్టం జరగలేదు.. ఆదివారం తెల్లవారుజామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1:37 గంటలకు ఒక…