PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన అధునాతన EOS-09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం కోసం ఉద్దేశించబడిన PSLV-C61 మిషన్ విఫలమైంది. ప్రయోగించిన కొన్ని నిమిషాలకే రాకెట్ తన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో, శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఈ శాటిలైట్ రాత్రి సమయాల్లో కూడా హై రెజల్యూషన్‌తో ఫోటోలు తీసే టెక్నాలజీ ఉంది. అయితే, ఈ ప్రయోగం విఫలం కావడంపై శాస్త్రవేత్తలు దర్యాప్తు చేపట్టారు.