Damadoara Raja Narasimha : అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే, తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు 4.88 డొనేషన్స్ జరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అవయవదానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకుగానూ రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO) అవార్డు ప్రకటించింది. శనివారం, ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల కార్యక్రమంలో కేంద్ర…