ఈశాన్య రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ గుడ్ న్యూస్ చెప్పంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో 2 కిలోల మున్నాను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. త్వరలోనే మున్నా సిలిండర్‌ను విడుదల చేస్తామని సంస్థ చెబుతుంది. ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్‌పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు.