Munna Cylinder: మార్కెట్లోకి 2 కిలోల ‘మున్నా’ సిలిండర్.. ఆ రాష్ట్రాలకు మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ గుడ్ న్యూస్ చెప్పంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో 2 కిలోల మున్నాను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. త్వరలోనే మున్నా సిలిండర్‌ను విడుదల చేస్తామని సంస్థ చెబుతుంది. ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్‌పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు. అస్సాంలో విలేకరుల సమావేశంలో అసోం ఆయిల్ డివిజన్ ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు స్టేట్ హెడ్.జి రమేష్ మాట్లాడుతూ.. గత ఏడాది ఈశాన్య ప్రాంతంలో ‘ఛోటు’ 5 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, తాము 2 కిలోల ‘మున్నా’ సిలిండర్‌ను కూడా ప్రవేశపెడతామని.. త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
త్రిపుర, నార్త్ గౌహతిలో త్వరలో ‘మున్నా’ బాటిలింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్లు రమేష్ తెలిపారు. ఈ తేలికపాటి LPG సిలిండర్‌లు పట్టణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలోని వలస జనాభా అవసరాలను తీరుస్తాయన్నారు. అంతేకాకుండా తక్కువ వినియోగం మరియు తక్కువ స్థలంలో వ్యాపారం చేసే వారికి ఈ సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ‘మున్నా’ సిలిండర్ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘మున్నా’ కిలో ధర సాధారణ డొమెస్టిక్ సిలిండర్‌తో సమానంగా ఉంటుంది. అయితే ‘ఛోటు’ సిలిండర్ ధర కొంచెం ఎక్కువగా ఉంది. రీజియన్‌లో ‘ఛోటు’కి మంచి స్పందన వచ్చిందని.. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 60,000-65,000 యూనిట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 15,000 యూనిట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు.
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ
ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ ఈశాన్య ప్రాంతంలో 871 LPG డిస్ట్రిబ్యూటర్లను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం 112 లక్షల LPG కస్టమర్ బేస్ ఉంది. అందులో 91 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు ఉన్నారు. మేఘాలయ మరియు మిజోరాంలలో అన్ని ఈశాన్య రాష్ట్రాలలో LPG బాట్లింగ్ ప్లాంట్లను నెలకొల్పడానికి ప్రాజెక్టులు ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రెండు రాష్ట్రాల్లో ఎటువంటి ప్లాంట్లు లేవు. అయితే మేఘాలయలోని ఉమియామ్ ప్రాంతంలో రూ.75.54 కోట్లతో ఏడాదికి 30 వేల మెట్రిక్ టన్నుల కొత్త (TMTPA) LPG బాట్లింగ్ ప్లాంట్‌కు సంబంధించిన పనులను చేపట్టారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?