జూన్ 1 నుంచి జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. ఈ పర్యటనలో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు,…
మెగా, జనసేన అభిమానులకు నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశారు. ఈనెల 17న తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నాగబాబు ఖండించారు. నిర్ధారణ చేసుకోకుండా మీడియాలో ఇటువంటి వార్తలు ఇవ్వడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఏమైనా పర్యటనలు ఉంటే అందుకు సంబంధించిన షెడ్యూల్ గురించి జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేస్తుందని సూచించారు. తాను ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని నాగబాబు కోరారు. Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు…
ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆ దిశగా దూకుడు పెం చుతోంది. ఈనెల 20వరకు వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పోరు యాత్రకు సిద్ధం అయింది. 500 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేది బీజేపీ వాదన. ప్రతిపాదిత పనులు చేపడితే ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుందని…
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉత్తారంధ్రలో భారీనుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ కె. కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర…