ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆ దిశగా దూకుడు పెం చుతోంది. ఈనెల 20వరకు వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పోరు యాత్రకు సిద్ధం అయింది. 500 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేది బీజేపీ వాదన. ప్రతిపాదిత పనులు చేపడితే ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుందని లెక్కలు చెబుతోంది. “జలం కోసం – ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర” నిర్వహిస్తోంది. వివిధ ప్రాజెక్ట్ ల ను సందర్శించడం, బహిరంగ సభలు ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడం బీజేపీ ప్రధాన ఉద్దేశం.
Read Also: JEE Mains 2022: జేఈఈ మెయిన్ మరోసారి రీ షెడ్యూల్
బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వం తరలి వస్తుండగా… తొలి రోజు శ్రీకాకుళం నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. వంశధార హాఫ్ షోర్ ప్రాజెక్ట్ ప్రాంతమైన హిరమండలం కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి ఒడిషా-ఆంధ్రాల మధ్య నలుగుతున్న నెరడి బ్యారేజ్, నిర్వాసీత సమస్యలను పరిశీస్తుంది. నదుల అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కాకపోవడం వల్ల సిక్కోలుకు సాగు, తాగునీటి ఇబ్బందులు…దశాబ్దాలుగా జరుగుతున్న నష్టంను ప్రజలకు వివరిస్తామంటోంది నాయకత్వం. జన పోరు యాత్ర రెండో రోజు పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో జరుగుతుంది. ఆఖరి రోజున విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ని దెబ్బతిన్న గ్రోయన్లు, సాగునీటి ప్రాజెక్ట్ లను పరిశీలిన చేయనుండగా ముగింపు సభ మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేశారు.