West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతా పైన ఈ దాడులు జరిగాయి.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో 24 పరగణాల్లోని ఇటుక బట్టీలోని చిమ్నీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బట్టీలో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. 30 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది.
పశ్చిమ బెంగాల్ లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. టీఎంసీ, బీజేపీలు ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణిస్తున్నారు.