Pakistan Airstrikes: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. తూర్పు కాబూల్‌లోని టీటీపీ (తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్), అల్-ఖైదా సేఫ్‌హౌస్ నుంచి పని చేస్తున్న టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిగింది. నగరంపై వైమానిక దాడులు జరిగినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు.