సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నాయి పల్లెలు.. ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్‌వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్‌వెజ్‌ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.
ఆదివారం కావడం వలన విశాఖలోని నాన్ వెజ్ మార్కెట్లు, దుకాణాలు కితకితలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో నాన్ వెజ్ మార్కెట్లకు ఎలా వెళ్లినా పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ, ప్రస్తుతం దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఆంక్షలు జారీ చేస్తున్నా అవి…