జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇక శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు…అంటున్నారు పురోహితులు. అవును మరి…వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ముహూర్తాలు ఉండవట. అందుకే తల్లిదండ్రులు హడావుడి…