తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు న్యాయస్థానికి నివేదిక సమర్పించారు. ఇదిలా వుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందని మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫీవర్ సర్వేలో 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం…
అసలే ఆదివారం. సంక్రాంతికి ఊరికి వెళ్లివచ్చినవారు తమ తమ స్వలాలకు చేరుకున్నారు. విజయవాడ బస్టాండ్లో తీవ్రమయిన రద్దీ ఏర్పడింది. కొంతమంది మాత్రమే కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరిగేవారికి ఆర్టీసీ వారు రూ.50 లు జరిమానాగా విధిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా శనివారం 43,763 శాంపిల్స్ ని పరీక్షించగా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వీరవిహారం చేస్తోంది. అందుకే నైట్ కర్ఫ్యూ విధించింది. సంక్రాంతి సందర్భంగా రిలాక్సేషన్ ఇచ్చింది. ఇదే ఒమిక్రాన్, కరోనా మహమ్మారికి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళంలో కరోనా బాధితులు లేని ఇల్లు లేదు . ఇబ్బంది పడని ఫ్యామిలీ కనిపించదంటారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లో జనాల జీవితాలను ఛిద్రం చేసింది ఈ కోవిడ్ . అయినా ప్రజల తీరులో మార్పు రాలేదు. గతాన్ని మరచిన ప్రజలు, విచ్చలవిడిగా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.…
తెలంగాణలో నిన్న మొన్నటివరకూ కరోనా నియంత్రణలో వుంది. అయితే విదేశాలనుంచి విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. విదేశాలనుంచి వచ్చేవారి విషయంలో నియంత్రణ చేపట్టింది. అయితే, తెలంగాణలో కరోనా నియంత్రణకు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టకపోవడం, కరోనా నియంత్రణకు మాస్క్ ధరించక పోవడంపై లోకాయుక్త సీరియస్ అయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టకకపోవడం, స్మోకింగ్ పై సుమోటోగా కేసు స్వీకరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకాయుక్త. గుంపులుగా…
తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీపతి తిరుపతి. దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ…
కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు. అయితే తాజాగా మంచిర్యాల జిల్లాలో.. థర్డ్ వేవ్ దృష్ట్యా డీసీపీ రోడ్డుపై నడుచుకుంటూ ఆ ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..…