కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్బుతం అని అంతా కొనియాడారు. కోటి ఎకరాలకు సాగునీరు అత్యద్భుతం, ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా… ఆ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు ఆగ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. యువకులు ఉపాధి కూడా కోల్పోతున్నారు. రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు నిర్ణయంతో పోరుబాటకు సిద్దం అవుతున్నారు రైతులు. ఆ రిజర్వాయర్ నిర్మాణంతో ఊళ్లో పెళ్ళి కాని ప్రసాదులు…