Today (02-02-23) Stock Market Roudup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. నిన్నటిలాగే మిశ్రమ ఫలితాలు నెలకొన్నాయి. ఇవాళ గురువారం కూడా సెన్సెక్స్ లాభపడగా నిఫ్టీ నష్టపోయింది. వరుసగా నాలుగో రోజు సైతం రెండు కీలక సూచీలు బెంచ్ మార్క్ దాటకుండానే దిగువనే ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విషయంలో పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో పరిస్థితులు మెరుగుపడకపోవటం గమనించాల్సిన విషయం.