మద్రాస్ హైకోర్టులోని జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్.. తిరుపత్తూరు జిల్లా కలెక్టర్, సంబంధిత తహశీల్దార్లను నెలలోపు పిటిషనర్ కు సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. అలాగే, రెవెన్యూ శాఖను సంప్రదించే అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ అటువంటి ధృవపత్రాలను జారీ చేయడానికి వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని తమిళనాడు సర్కార్ ను న్యాయస్థానం కోరింది.