ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనికి పునాది పడింది. తాజాగా కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది
హర్యానా ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చీలికలు తెచ్చేలా కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ హస్తం పార్టీ మాత్రం.. రెండు, మూడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది.
Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య సీట్ల పంపకాల వివాదంలో పొత్తు విఫలమైంది. అందిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రెండు పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇది మాత్రమే కాదు. ఆప్ తన మొదటి జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ చర్య భారత కూటమిలోని రెండు పార్టీల మధ్య దూరం కూడా తీసుకురావచ్చని అంచనాలు వేస్తున్నారు.…
త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది.