నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ కేటాయింపు సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పక్షాన నిలబడి ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.