హైదరాబాద్‌లో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యం అందించడంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. బసవతారకం ఆసుపత్రిలో ఇవాళ 21 బెడ్స్ తో ఒక అధునాతన డేకేర్ వార్డ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు. 100 పడకల ఆసుపత్రిగా మొదలైన ఈ ప్రస్థానం ఈ రోజు 650 పడకలుగా అభివృద్ధి చెందడం… అనేక అధునాతన సౌకర్యాలను సమకూర్చుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రోజు రోజుకి క్యాన్సర్ రోగుల…
నీతి ఆయోగ్ ముందు ఏపీ ప్రభుత్వం సమస్యల చిట్టా పెట్టింది. రాష్ట్ర విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నీతి ఆయోగ్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. తీవ్ర రుణభారంతో ఉన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలను గాడిలో పెట్టడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర విభజన అనంతర పర్యవసనాల కారణంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను, హైదరాబాద్‌ను కోల్పోవడంతో పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడిందని గణాంకాలతో సహా నీతి ఆయోగ్ దృష్టికి…
దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. వరుసగా కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, గజేంద్రసింగ్ షెకావత్‌లను కలిసిశారు.. ఆ తర్వాత నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌తో భేటీ అయ్యారు.. పలు అభివృద్ధి అంశాలపై చర్చ సాగింది.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం… రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించినట్టు తెలిపారు.. ఇళ్ల పట్టాల…
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. 75 శాతం తాము కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తామని.. మిగతా 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఇస్తామన్నారు.. ఇక, టీకా వేసేందుకు మాత్రం రూ.150 మించి వసూలు చేయరాదని కూడా స్పష్టం చేశారు ప్రధాని.. కానీ, ఇవాళ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు…
స్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంకులు విడుదల చేసింది. పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఏపీకి ర్యాంకులు ప్రకటించింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ తాజా ర్యాకింగ్స్ లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి చోటు దక్కింది. 2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ లో 72 స్కోర్ తో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా సాధించింది ఏపీ. 75 స్కోర్ తో…
కరోనా ఫస్ట్ వేవ్ పెద్దలపై తీవ్రమైన ప్రభావం చూపింది.. సెకండ్ వేవ్ యూత్‌ను కూడా అతలాకుతలం చేసింది.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉండగా.. దాని ప్రభావం చిన్నారులపైనే ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, దీనిపై స్పందించిన నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్.. కరోనా వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే పిల్లలపై అధిక ప్రభావం చూపవచ్చు అన్నారు.. ఆ పరిస్థితి వస్తే.. రెండు నుంచి మూడు శాతం చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స…