అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. 75 శాతం తాము కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తామని.. మిగతా 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఇస్తామన్నారు.. ఇక, టీకా వేసేందుకు మాత్రం రూ.150 మించి వసూలు చేయరాదని కూడా స్పష్టం చేశారు ప్రధాని.. కానీ, ఇవాళ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు.. ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా ధరలను వ్యాక్సిన్ తయారీ సంస్థలే నిర్ణయిస్తాయని తెలిపారు. ప్రైవేట్ రంగం డిమాండ్‌ను బట్టి టీకాల కేటాయింపు ఉంటుందన్నారు. మరోవైపు.. 25 కోట్ల కోవిషీల్డ్ టీకాలను, 19 కోట్ల కోవాక్సిన్ డోసులు కొనుగోలు చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించిందన్నారు డాక్టర్ వీకే పాల్.. 30 కోట్ల బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ టీకాలు కూడా కొనుగోలు చేయబోతున్నట్టుగా తెలిపారు. ఇవి సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు వీకే పాల్… ఇక, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము గౌరవిస్తామని.. కానీ, వ్యాక్సినేషన్‌లో మే 1వ తేదీ నుంచి వికేంద్రీకరణ విధానాన్ని తాము అవలభింస్తున్నామని చెప్పుకొచ్చారు వీకే పాల్.. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే వ్యాక్సినేషన్‌లో కొత్త గైడ్‌లైన్స్ ప్రవేశపెట్టారా? అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.