ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ వచ్చాక నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ దేశంలో అత్యంత హీనంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్‌లోనే ఉండే ముఖ్య మంత్రి కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎంతో…
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని జిల్లాల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని.. ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పెండింగ్ ఫైళ్లు పెరిగిపోతున్నాయన్నారు. ఇక, సచివాలయంలోనూ ఫైళ్లు పేరుకపోతున్నాయన్న ఆమె..…
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’ చేపట్టారు. ఈ దీక్షను ముందుగా ఇందిరాపార్క్ వద్ద చేపట్టాలని భావించారు.అయితే కోవిడ్ నిబంధనల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంబంధంచి ప్రత్యక్ష ప్రసారాన్న వీక్షించడానికి ఈ క్రింద లింక్‌ను క్లిక్ చేయండి.
తెలంగాణలో నిరుద్యోగ దీక్షకు దిగింది బీజేపీ. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి కేటీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’ను అవమానిస్తూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ పేరుతో చేసిన విమర్శలు చేయడం ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమే.…
తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్‌లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్‌బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా…
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు… క్రమంగా విమర్శల వాడి పెంచుతున్నారు.. ఇప్పటికే ఇందిరా పార్క్, లోటప్‌పాండ్ లో దీక్షలు చేసిన షర్మిల.. తాజాగా ఖమ్మం వేదికగా నిరుద్యోగ దీక్ష చేశారు.. ఇక, ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పాటించాలని వైఎస్‌ఆర్‌టీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా రాబోయే మంగళవారం (27వ తేదీ) ఉమ్మడి నల్గొండ…