తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. వరస చేరికలతో హుషారుగా కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే ప్రజా సమస్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో వరసగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వరంగల్ సభకు రాహుల్ గాంధీ రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్…