నిర్మల్‌లో అట్టహాసంగా అమిత్ షా సభ నిర్వహించిన కమలనాథులు.. బొమ్మలాట పంచాయితీకి దిగారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఈ అంశమే బీజేపీ నేతలకు తలనొప్పి తెచ్చిపెడుతోందా? పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ జోక్యం చేసుకున్నా సెగలు అలాగే ఉన్నాయా? ఇంతకీ ఏంటా గొడవ? లెట్స్ వాచ్..! బీజేపీలో నిర్మల్ సభ ప్రకంపనలు..! ఈ ఏడాది తెలంగాణలో బీజేపీ నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ వేదికైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్…
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం.. మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం.. కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా… నిర్మల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత…