హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. మంగళవారం తొమ్మిది మందితో కూడిన రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. సోమవారం 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజా జాబితాతో కలిపి మొత్తం 29 స్థానాలకు అభ్యర్థులను ఆప్ వెల్లడించింది.